నక్షత్రములు - ఆకారములు :
విశ్వమనే ఆకాశ గోళములో కోటాని కోట్ల నక్షత్రములతో నిండి యున్నది. కొన్ని నక్షత్రాల గుంపుల ఆకృతులు బట్టి వాటికి మన పూర్వీకులు నామకరణములు చేసి యున్నారు. గ్రహాలు కదిలే మార్గ బాటలో నున్న నక్షత్రాల గుంపులకు అశ్వని మొదలుకుని రేవతి వరకూ నామకరణములు చేసియున్నారు. అవి మండలాకృతిలో పడమరనుండి తూర్పునకు సమాన అంతరములలో పేర్చబడి యున్నవి. వాటి ఆధారముగా గ్రహాల స్థితి గతులను తెలియుజేయుదురు. వాటిగురించి తెలిసికొందాము.

అశ్వనీ నక్షత్రములగుంపు అశ్వముఖమువలె మూడు పొట్టి నక్షత్రములు గలదై యున్నది.
భరణి నక్షత్రములగుంపు యోనివలె మూడునక్షత్రములు గలదై యున్నది.
కృత్తికా నక్షత్రములగుంపు మంగలి కత్తెర వలె నాఱు నక్షత్రములు గలదై యున్నది.
రోహిణీ నక్షత్రములగుంపు బండివలె నైదు నక్షత్రములు గలదై యున్నది.
మృగశిరా నక్షత్రములగుంపు శిరస్సువలె మూడు నక్షత్రములు గలదై యున్నది.
ఆరుద్ర నక్షత్రములగుంపు పగడపువర్ణము గలిగి ఒంటి నక్షత్రము గొప్పదై యుండును
పునర్వసు నక్షత్రములగుంపు కుమ్మరి సారెవలె అయిదు నక్షత్రములు గలదై యున్నది.
పుష్యమి నక్షత్రములగుంపు పొట్ల పూవు వలె మూడు నక్షత్రములు గలదై యున్నది.
ఆశ్లేషా నక్షత్రములగుంపు సర్పమువలె నారు నక్షత్రములు గలదై యున్నది.
మఖా నక్షత్రములగుంపు ఫలకీ వలె అయిదు నక్షత్రములు గలదై యున్నది.
పుబ్బ నక్షత్రములగుంపు నేత్రము వలె రెండు నక్షత్రములు గలదై యున్నది.
ఉత్తర నక్షత్రములగుంపు నేత్రము వలే రెండు నక్షత్రములు గలదై యున్నది.
హస్త నక్షత్రములగుంపు చేతి వేళ్ళవలె అయిదు నక్షత్రములు గలదై యున్నది.
చిత్త నక్షత్రములగుంపు ముత్యమువలె ఒక్క నక్షత్రము గలదై యున్నది.
స్వాతి నక్షత్రములగుంపు మాణిక్యము వలె నొక నక్షత్రములు గలదై యున్నది.
విశాఖ నక్షత్రములగుంపు కుమ్మర నారెవలె అయిదు నక్షత్రములు గలదై యున్నది.
అనూరాధా నక్షత్రములగుంపు అంకుశము వలె చతాకారమై మూడు నక్షత్రములు గలదై యున్నది.
జేష్ట నక్షత్రములగుంపు అంగుళము వలె చతాకారమై మూడు నక్షత్రములు గలదై యున్నది.
మూలా నక్షత్రములగుంపు సింహమువలె అయిదు నక్షత్రములు గలదై యున్నది.
పూర్వాషాఢ నక్షత్రములగుంపు చౌకము వలె రెండు నక్షత్రములు గలదై యున్నది.
ఉత్తరాషాఢ నక్షత్రములగుంపు చౌకము వలె రెండు నక్షత్రములు గలదై యున్నది.
శ్రవణ నక్షత్రములగుంపు ముత్స్యము వలె మూడు నక్షత్రములు గలదై యున్నది.
ధనిష్టా నక్షత్రములగుంపు శిరస్సువలె మూడు నక్షత్రములు గలదై యున్నది.
శతభిష నక్షత్రములగుంపు పుష్పగుత్తెవలె నూరు నక్షత్రములు గలదై యున్నది.
పూర్వాభాద్ర నక్షత్రములగుంపు మంచపు కోళ్ళవలె రెండు నక్షత్రములు గలదై యున్నది.
ఉత్తరాభాద్ర నక్షత్రములగుంపు మంచపు కోళ్ళవలె రెండు నక్షత్రములు గలదై యున్నది.
రేవతీ నక్షత్రములగుంపు ముత్స్యమువలె మూడు నక్షత్రములు గలదై యున్నది.

రాశులు :
విశ్వమనే ఆకాశ గోళములో గ్రహాలు తిరిగే బాటను 27 సమ బాగములు చేయగా వచ్చిన భాగమే నక్షత్రము. 12సమ బాగములు చేయగా వచ్చిన భాగమే రాశికి.. అనగా 27నక్షత్రములు కలిసి 12 రాశులైనవి. 12 రాశులు కలిసి ఒక భచక్రమైనది. భచక్రమనగా గ్రహాలు కదిలే నక్షత్రాల బాట యొక్క వృత్తము అని అర్ధము. వాటి గురించి తెలిసి కొందాము.
రెండు నక్షత్రముల మద్య అంతరము 13.3333330 డిగ్రీలు లేదా 800 / నిముషములు .
ఒక నక్షత్రమును 4 సమబాగములుచేయగా వచ్చిన భాగమే పాధము .
రెండు పాధములమద్య అంతరము 3.3333330 డిగ్రీలు లేదా 200 / నిముషములు .
4 పాదములు = ఒక నక్షత్రము .
9 పాదములు = ఒక రాశి.
12 రాశులు = ఒక భచక్రము.
108 పాదములు = 27 నక్షత్రములు = 12 రాశులు = ఒక భచక్రము.
108 x 3.333333 = 27 x 13.333333 = 12 x 30° = 360° డిగ్రీలు.
1 వ రాశి మేషం. ఇందు అశ్వని 1-2-3-4 పా, భరణి 1-2-3-4 పా, కృత్తిక 1పా కలసి 9 పాదములు యున్నవి.
2వ రాశి వృషభం. ఇందు కృత్తిక 2-3-4పా, రోహిణి 1-2-3-4 పా, మృగశిర1-2పా కలసి 9 పాదములు యున్నవి.
3వ రాశి మిధునం. ఇందు మృగశిర 3-4పా, ఆరుద్ర 1-2-3-4 పా, పునర్వస్సు 1-2-3 పా కలసి 9 పాదములు యున్నవి.
4వ రాశి కర్కాటకం. ఇందు పునర్వస్సు 4పా, పుష్యమి 1-2-3-4 పా, ఆశ్లేష 1-2-3-4 పా కలసి 9 పాదములు యున్నవి.
5వ రాశి సింహం. ఇందు మఖ 1-2-3-4పా, పుబ్బ 1-2-3-4 పా, ఉత్తర 1 పా కలసి 9 పాదములు యున్నవి.
6వ రాశి కన్య. ఇందు ఉత్తర 2-3-4పా, హస్త 1-2-3-4 పా, చిత్త 1-2 పా కలసి 9 పాదములు యున్నవి.
7వ రాశి తుల. ఇందు చిత్త 3-4పా, స్వాతి 1-2-3-4 పా, విశాఖ 1-2-3 పా కలసి 9 పాదములు యున్నవి.
8వ రాశి వృశ్చికం. ఇందు విశాఖ 4పా, అనూరాధ 1-2-3-4 పా, జేష్ట 1-2-3-4 పా కలసి 9 పాదములు యున్నవి.
9వ రాశి ధనస్సు. ఇందు మూల 1-2-3-4పా, పూర్వాషాడ 1-2-3-4 పా, ఉత్తరాషాడ 1 పా కలసి 9 పాదములు యున్నవి.
10వ రాశి మకరం. ఇందు ఉత్తరాషాడ 2-3-4పా, శ్రవణం 1-2-3-4 పా, ధనిష్ట 1-2 పా కలసి 9 పాదములు యున్నవి.
11వ రాశి కుంభం. ఇందు ధనిష్ట 3-4పా, శతభిషం 1-2-3-4 పా, పూర్వాభాద్ర 1-2-3 పా కలసి 9 పాదములు యున్నవి.
12వ రాశి మీనం. ఇందు పూర్వాభాద్ర 4పా, ఉత్తరాభాద్ర 1-2-3-4 పా, రేవతి 1-2-3-4 పా కలసి 9 పాదములు యున్నవి.

తిదులు :
సూర్యుని నుండి చంద్రునికి 12డిగ్రీలు అంతర దూరములను బట్టి తిదిని నిర్ణయించుదురు. రెండు తిదుల మద్య అంతరదూరము 12 డిగ్రీలు అనగా 720 నిముషములు. 360 డిగ్రీలు మద్య అంతరదూరము మొత్తము 30 తిదులు. ఇందు శుద్ధ పాడ్యమి తిధితో ప్రారంబమై శుద్ధ విదియ, శుద్ధ తదియ, శుద్ధ చతివి, శుద్ధ పంమి, శుద్ధ షష్ఠి, శుద్ధ సప్తమి, శుద్ధ అమిష్ట, శుద్ధ నవమి, శుద్ధ దశమి, శుద్ధ ఏకాదశి, శుద్ధ ద్వాదశి, శుద్ధ త్రయోదశి, శుద్ధ చతుర్ధశి, శుద్ధ పూర్ణిమి, బహుళ పాడ్యమి, బహుళ విదియ, బహుళ తదియ, బహుళ చతివి, బహుళ పంమి, బహుళ షష్ఠి, బహుళ సప్తమి, బహుళ అమిష్ట, బహుళ నవమి, బహుళ దశమి, బహుళ ఏకాదశి, బహుళ ద్వాదశి, బహుళ త్రయోదశి, బహుళ చతుర్ధశి, చివరగా బహుళ అమావస్యతో ముగింపు జరుగును.

నక్షత్రము :
మేషారంభము నుండి చంద్రునికి 13.3333డిగ్రీలు అంతర దూరములను బట్టి నక్షత్రము నిర్ణయించుదురు. రెండు నక్షత్రములు మద్య అంతరదూరము 13.3333డిగ్రీలు అనగా 800 నిముషములు. 360 డిగ్రీలు మద్య అంతరదూరము మొత్తము 27 నక్షత్రములు. ఇందు అశ్వని నక్షత్రముతో ప్రారంబమై భరణి , కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర,, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త,చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రముతో ముగియును.

కరణములు :
సూర్యుని నుండి చంద్రునికి 6 డిగ్రీలు అంతర దూరములను బట్టి కరణము నిర్ణయించుదురు. రెండు కరణముల మద్య అంతరదూరము 6 డిగ్రీలు అనగా 360 నిముషములు. 360 డిగ్రీలు మద్య అంతరదూరము మొత్తము 60 కరణములు. ఇందు చంద్ర మాసము కింస్తుఘ్న కరణముతో ప్రారంబమై బల, బాలవ, కౌలువ, తైతుల, గణజ, వణజ, విష్టి అనే ఏడు కరణములు ఎనిమిది మార్లు ఒకదాని తర్వాత ఒకవకటి తిరిగి చివరిగా విష్టి, శకుని, చతుష్పాద, నాగ కరణములతో మాసము ముగింపు జరుగును.

యోగములు :
సూర్యు చంద్రుల రేఖాంశముల మొత్తమును 13.3333 డిగ్రీలు అంతర దూరములను బట్టి యోగము నిర్ణయించుదురు. రెండు యోగములు మద్య అంతరదూరము 13.333డిగ్రీలు అనగా 800 నిముషములు. 360 డిగ్రీలు మద్య అంతరదూరము మొత్తము 27 యోగములు. ఇందు విష్కంభ యోగముతో ప్రారంబమై ప్రీతి , ఆయుష్మన్, సౌభాగ్య, శోభన, అతిగండ, సుకర్మ, ధృతి, శూల, గండ, వృద్ధి, ధ్రువ, వ్యాఘాత, హర్ష , వజ్ర, సిద్ధి, వ్యతీపాత, వరీయో, పరిఘ, శివ, సిద్ధ, సాధ్య, శుభ, శుక్ల, బ్రహ్మ, ఇంద్ర , వైధృతి యోగముతో ముగియును.

పక్షము :
సూర్యుని నుండి చంద్రునికి 180 డిగ్రీలు అంతర దూరములను బట్టి పక్షము నిర్ణయించుదురు. రెండు పక్షముల మద్య అంతరదూరము 180 డిగ్రీలు. 360 డిగ్రీలు మద్య అంతరదూరము మొత్తము 2 పక్షములు. ఇందు మొదటిది శుద్ధ పక్షము రెండవది బహుళ పక్షము.

మాసము :
రెండు పక్షములు అనగా 30 తిదులు ఒక చాంద్ర మాసము.